Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంతిభద్రతలకు సహకరించాలి : ఎస్ఐ పుట్ట మహేష్

శాంతిభద్రతలకు సహకరించాలి : ఎస్ఐ పుట్ట మహేష్

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల మండల ప్రజలకు ఎస్సై పుట్ట మహేష్ హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, రోడ్లపై గాజు సీసాలు పగులగొట్టడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పునుంతల పోలీస్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 87126 57738కు సమాచారం ఇవ్వాలని ఎస్సై పుట్ట మహేష్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -