Thursday, May 28, 2026
E-PAPER
HomeNewsనియోజకవర్గ కేంద్రంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి: సర్పంచ్

నియోజకవర్గ కేంద్రంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ తుంగతుర్తి: సరిహద్దు ప్రాంతమైన తుంగతుర్తిలో అత్యవసర వైద్య సేవలు, నర్సింగ్ సిబ్బంది కొరత దృష్ట్యా,ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బీఎస్సీ నర్సింగ్ కాలేజీలలో ఒకటి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా కోరారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల యువతకు, మహిళలకు వైద్య విద్య చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి నర్సింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణకు అనుకూలంగా మార్చాలని అన్నారు. కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ, స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు, స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లు చొరవ తీసుకునేలా చూడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -