జర్నలిస్టులకు అండగా ఉంటాం

– జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు,
– ప్రెస్‌ క్లబ్‌ ఏర్పాటు చేసేందుకు కషి
– కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మి మోసపోవద్దు
– జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలో జర్నలిస్టులకు తాను అండగా ఉంటానని శనివారం తాండూరు పట్టణ కేంద్రం లోని దుర్గా గ్రాండ్యూయర్‌ హౌటల్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తానన్నారు. తాండూరులో ప్రతి జర్నలిస్టుకూ ఇండ్ల స్థలా లు ఇచ్చేందుకు ముందుంటానన్నారు. తాండూరు నియో జకవర్గ అభివద్ధి, భవిష్యత్‌ తరాల కోసమే తన రాజకీయ జీవితం అన్నారు. తాండూరు నియోజకవర్గం లో బైపాస్‌ రోడ్డు రింకు రోడ్డు విస్తరణ జిల్లా ఆస్పత్రి, మాతా శిశు ఆస్పత్రి, బీసీ భవన్‌, బంజారా భవన్‌, పారిశ్రామికవాడ, ఐఐటీ, చెక్‌ డాంల నిర్మాణం, పల్లె దవాఖాన, బస్తీ దావా ఖాన, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కేసీఆర్‌ కిట్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ కార్యక్రమాలను విజయ వంతం చేసేందుకు కషి చేశారన్నారు. తాండూరు చరిత్ర లో గతంలో ఎన్నడూ జరిగిన విధంగా అభివద్ధి చేశారన్నారు. తాండూరులో వేల కోట్ల రూపాయలతో అభి వద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు తాండూరు ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను నమ్మొద్దని వారు చేసే కుట్రలను బయటపెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో రోజురోజుకు వలసదారుల పోటి ఎక్కు వైందన్నారు. వాళ్లందర్నీ ప్రజలు తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. తాను నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రజ లు తనను ఆదరిస్తారని ప్రతి ఒక్కరూ తనకు సహకరిం చారన్నారు. ఇదే సహకారం ఇదే బాధ్యతగా తనకు మరొక సారి అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ప్రెస్‌ క్లబ్బు వంటివి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సి పల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ దీపా నర్సింలు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పురుషోత్తమరావు, నారాయణరెడ్డి, శ్రీశైల్‌ రెడ్డి శ్రీనివాసచారి, కౌన్సిలర్లు శోభారాణి, నీరజ, నర్సింహులు, నర్సిరెడ్డి,వివిధ మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Spread the love