– మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని బొంపల్లి గ్రామానికి చెందిన పట్నం అంతమ్మ ఆదివారం ఉదయం మృతిచెందారు. విషయాన్ని తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టి.రామోహన్ రెడ్డి అందుబాటులో లేనందున ఉమా రామ్మోహన్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసాగా రూ.5 వేలు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ గందే రాములు, ఆర్ నరసింహారెడ్డి, ముద్దం బాలరాజు యాదవ్, ఉదరోన్ పల్లి యాదయ్య, బ్యాగరీ ప్రభు, ప్రవీణ్ యాదవ్, రమేష్, కోళ్ల చంద్రయ్య, ఫెరోజ్, హైమద్, కుర్వ రమేష్, అప్పగాళ్ల మహేష్, అప్పగాళ్ల శ్రీను, బోడ వెంకటయ్య, జోగు జంగయ్య కోళ్ల హన్మయ్య మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.