సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళలో వామపక్షాల ఓటమి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోని రెండు ప్రధాన అంశాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. తమిళనాడులో డీఎంకే కూటమికి ఎదురుదెబ్బ తగిలిందని, అక్కడ నటుడు విజరు టీవీకే పార్టీ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. అసోంను నిలబెట్టుకున్న బీజేపీ, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పుదుచ్చేరిలో మరోసారి గెలుపొందిందని అన్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం సీపీఐ(ఎం) కేంద్ర కార్యా లయం (ఏకేజీభవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి మాట్లా డారు. ”పదేండ్ల నిరంతర పాలన తరు వాత కేరళంలో వామపక్షాలు ఓటమి పాల య్యాయి. వామపక్ష ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. తీవ్ర పేదరికాన్ని నిర్మూ లించిన తొలి ప్రభుత్వంగా నిలిచింది. అయినప్పటికీ వామపక్షాలకు ఎదురైన ఓటమిని లోతుగా పరిశీలి స్తాం” అని బేబీ అన్నారు. ”బెంగాల్‌లో బీజేపీ విజయం వెనుక తణమూల్ కాంగ్రెస్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో సహా అనేక కారణాలు ఉన్నాయి. మత విద్వేషపూరిత, విచ్ఛిన్నకర ప్రసంగాలు, భారీస్థాయిలో నగదు ప్రవాహం, ఎన్నికల సంఘంతో సహా కేంద్ర సంస్థల దుర్విని యోగం, సర్ ప్రక్రియ వంటివన్నీ బీజేపీ విజయానికి కారణాలయ్యాయి. ఇంతటి తీవ్ర పరిస్థితుల్లోనూ, వామపక్షాలు తమ స్థానాన్ని కొంత మేర మెరుగు పరుచుకోగలిగాయి” అని అన్నారు.”పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో బీజేపీ నేతత్వంలోని మితవాద మతతత్వ శక్తులు పురోగమిం చాయి. ఇది లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తుల న్నింటికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయం. సీపీఐ(ఎం)పై విశ్వాసం ఉంచిన ప్రజలకు, కార్యకర్త లకు ధన్యవాదాలు. సీపీఐ(ఎం) ప్రజల తీర్పును గౌరవిస్తుంది. కేరళంలో వామపక్షాల ఓటమికి దారి తీసిన కారణాలను పార్టీ సమీక్షిస్తుంది. పార్టీ అవసర మైన అన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. ప్రజల హక్కుల కోసం, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుంది” అని బేబీ స్పష్టం చేశారు. తదుపరి పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాల్లో ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ చేస్తామని అన్నారు. ”ఎన్నికల ఫలితాల వల్ల తలెత్తిన కొత్త రాజకీయ పరిస్థితి సష్టించే సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాము” అని అన్నారు.
ఓటమిపై లోతుగా పరిశీలిస్తాం
- Advertisement -
- Advertisement -



