శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగురవేస్తాం

– విప్‌ ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-చందానగర్‌
హఫీజ్పెట్‌ డివిజన్‌ పరిధిలోని హుడా కాలనీ లో కాలనీ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడా రు. తనపై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీ మెజా రిటీతో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతానని ఆయన తెలి పారు. తన వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియో జకవర్గ ప్రజానీకానికి, బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యుల కు, కార్పొరేటర్లకు, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులకు, పార్టీ శ్రేణులకు, వార్డ్‌ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రుల కు, అభిమానులకు, శ్రేయభిలాషులకు, కాలనీల అ సోసియేషన్‌ సభ్యులకు, కాలనీ వాసులకు కృత్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హఫీజ్పెట్‌ డివిజన్‌ బీఆర్‌ ఎస్‌ అధ్యక్షులు హరీష్‌ రావు , హఫీజ్పెట్‌ డివిజన్‌ బీ ఆర్‌ఎస్‌ అధ్యక్షులు బల్లింగ్‌ గౌతంగౌడ్‌ నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love