ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తాం

– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగజ్యోతి
నవతెలంగాణ-గంగారం
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కో సం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని, పార్టీ ప్రకటిం చిన మ్యానిఫెస్టో కూడా ప్రజల అవసరాలు, అభ్యున్నతి ల క్ష్యంగా రూపొందించిందని ములుగు ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడా నాగజ్యోతి అన్నారు. గంగారం మండలంలో ని దుబ్బగూడేం గ్రామం నుండి మొదలైన ప్రచారం మం డలంలోని అన్ని గ్రామాలను తిరుగుతూ పార్టీ ఏం చేస్తుం ది ఏం చేయబోతుందని తెలిపారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమన్నారు. జరుగుతున్న అభివృద్ది మ రింత ముందుకు తీసుకువెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ను మరో సారి ఆశీర్వదించి, అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ఈ ప్రచారంలో మండలాధ్యక్షులు ఇర్పప సూర య్య, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్‌ బాలకృష్ణ, మండల నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love