అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ భవనం నిర్మించేందుకు కృషి చేస్తాం

– ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేసిన
– ఎమ్మార్పీఎస్‌ నాయకులు
నవతెలంగాణ-యాచారం
యాచారం మండల కేంద్రంలో డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ భవనం నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీనిచ్చారు. సోమవారం యాచారం మండల కేంద్రంలో దళిత భవనం నిర్మించాలని ఎమ్మెల్యేకు ఆయన నివాసం దగ్గర ఎమ్మార్పీఎస్‌ నాయకులు వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో భవనం నిర్మించేందుకు అవసరమైన స్థలం సేకరణ గురించి తహసీల్దార్‌తో మాట్లాడినట్టు తెలిపారు. భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ నిచ్చారు. దళితుల అభివద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టు బడి పని చేస్తుందని తెలిపారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. మండల కేంద్రంలో త్వరలోనే దళిత భవన నిర్మా ణానికి అవసరమైన నిర్ణయాలు వెంటనే తీసుకో నున్నట్టు వివరించారు. అనంతరం ఎమ్మెల్యేకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు కతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్‌ బోడ కష్ణ, కో కన్వీనర్లు సిద్దాపురం శ్రీకాంత్‌, కష్ణ, బండిమీది కష్ణ, కాళ్ల జంగయ్య, చింతుల్ల సాయిలు, జోగు అంజయ్య, అంజయ్య, కొండాపురం కష్ణ, కంబాళ్లపల్లి సాయిలు, కందికంటి ఆనంద్‌, కందుకూరి బాల్రాజ్‌, తాండ్ర మహేష్‌, ముచ్చర్ల వెంకటరమణ, యాదయ్య, సుధాకర్‌, యాదయ్య, రాములు పాల్గొన్నారు.

Spread the love