ఏం చేశారో వివరించాకే చేయాలి.. లేదంటే అడ్డుకుంటాం : లంబాడ సంఘాల జేఏసీ
నవతెలంగాణ – బంజారాహిల్స్
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లంబాడాలకు ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరించిన తర్వాతే గిరిజన తాండాల్లో బస్సు యాత్ర చేపట్టాలి” అని లంబాడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.లంబాడ ప్రజాప్రతినిధులు చేపట్టే బస్సు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు రఘురాం రాథోడ్, అశోక్ రాథోడ్ మాట్లాడారు. తెలంగాణలో లంబాడ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి మద్దతుగా చేపట్టనున్న బస్సు యాత్రకు ముందు కాంగ్రెస్ పాలనలో లంబాడ సమాజానికి కల్పించిన ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేయాలని కోరారు. లంబాడ తండాల్లో ప్రజాప్రతినిధులు ఏం మొఖం పెట్టుకుని బస్సు యాత్ర నిర్వహిస్తారో చెప్పాలన్నారు. లంబాడ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అయినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు బస్సు యాత్ర నిర్వహించడం సిగ్గు చేట న్నారు. రాష్ట్రవ్యాప్తంగా లంబా డ సంఘాలు, ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకో వాలని, అనంతరం యాత్ర చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీ ఎస్ నాయకులు నరేష్ రాథోడ్, మైదాన ప్రాంత సేవాలాల్ సంఘం నాయకులు సురేష్ నాయక్, రాజునాయక్, రవిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ఏం చేశారని బస్సు యాత్ర?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



