నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఐకెపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐ టీయూ) రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గా ఎం.నాగేశ్, ఎస్వీ రమ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆ సంఘం నాలుగో మహాసభలు హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం (నూర్జహాన్ నగర్)లో జరిగాయి. మహాసభ పలు తీర్మానాలను ఆమోదిం చింది. చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరింది. కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేసి వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేసింది. గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు చెల్లించా లని, ఉద్యోగ భద్రత కల్పిం చాలని, సెర్ఫ్ నుంచి వీవోఏలకు ఐడి కార్డులు ఇవ్వాలని మహాసభ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం 41 మంది తో మహాసభ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర గౌరవాధ్యక్షలుగా జె.వెంక టేష్, రాష్ట్ర అధ్యక్షులుగా ఎం. నగేష్, వర్కింగ్ ప్రెసిండెంట్ కె. రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు జి.పద్మ (కొత్తగూడెం), వసియా బేగం (మహ బూబ్ నగర్), భాగ్యలక్ష్మి (సంగారెడ్డి), వి.సుధాకర్ (మహబూ బాబాద్), అంజి (గద్వాల్), సిహెచ్. దుర్గయ్య, కో-ఆప్షన్ (మెదక్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ. రమ, కార్యదర్శులు ఆంజనేయులు (సంగారెడ్డి), చంద్రలీల (కొత్తగూడెం), సునీత (నాగర్ కర్నూల్) సులోచన, (నల్లగొండ), కిష్టయ్య( సిద్దిపేట), శ్రీనివాస్(నారాయణపేట్), వెంకటయ్య (వనపర్తి), కోశాధికా రిగా సుమలత, (నాగర్ కర్నూల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘంఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం.నాగేశ్, ఎస్వీ రమ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



