Tuesday, July 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకింకర్తవ్యం?

కింకర్తవ్యం?

- Advertisement -

బెడిసికొడుతున్న ట్రంప్‌ వ్యూహాలు
ఇరాన్‌ యుద్ధంలో అన్నీ చేదు అనుభవాలే
రోజుకో మాటతో తడబాటు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఓ సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైన ప్రతిసారీ ఆయనకు ఉన్న అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఆయన ఏ చర్య తీసుకున్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వరుసగా 13 రాత్రులు ఇరాన్‌పై దాడులు చేసిన తర్వాత వైమానిక దాడులకు విరామం ఇవ్వాలని ట్రంప్‌ నిర్ణయించారు. దౌత్య ప్రయత్నాలకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. దౌత్య యత్నాలు కొనసా గుతున్నాయని చెప్పడానికి కొన్ని సంకేతాలు కల్పి స్తున్న మాట నిజమే. ఒమన్‌తో ఇటీవలే ఇరాన్‌ చర్చలు జరిపింది. అయితే అమెరికాతో తాజా ఉద్రిక్తతలకు కారణమైన హార్ముజ్‌ జలసంధి విషయంలో మాత్రం టెహ్రాన్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాడులను తీవ్రతరం చేస్తానని ఒకసారి, భూతల దాడులు జరుపుతానని మరోసారి సంకేతాలు ఇచ్చిన ట్రంప్‌ ఆ పనులు చేయలేకపోయారు. భూతల దాడులు జరిపితే ప్రాణనష్టం అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయన వెనకడుగు వేశారు.

ఆయుధ నిల్వలు అడుగంటుతుంటే 
ఉధృత దాడులా ?
ఇంటా బయటా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ట్రంప్‌ ముందు ఇప్పుడు దారులు మూసుకుపోతున్నాయి. రోజుకో మాట మాట్లాడుతున్న ట్రంప్‌లో తడబాటు స్పష్టంగా కన్ని స్తోంది. మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ కేంద్రాలపై దాడుల ద్వారా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ట్రంప్‌ ఇప్పుడు ప్రయత్నిం చవచ్చు. అయితే దీనివల్ల వ్యతిరేకత పెరుగుతుందే తప్ప తగ్గదని, పైగా ఇరాన్‌ నాయకత్వ పోరాట పటిమ మరింత ద్విగుణీకృతం అవుతుందఁ సన్నిహితులే హెచ్చరిస్తున్నారు. గత శుక్రవారం అధ్యక్షభవనంలో ఓ సమావేశం జరిగింది. ఆయు ధ నిల్వలు అడుగంటుతున్న వేళ యుద్ధాన్ని తీవ్రతరం చేయడంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మె న్‌ డాన్‌ కెయిన్‌ ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా జరిపిన బాంబు దాడులు సం ప్రదింపులపై ఇరాన్‌ వైఖరిఁ మార్చబోవఁ సీఐఏ, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అంచనా వేశాయి.

ఏ చర్య తీసుకున్నా ఇబ్బందే
ఇరాన్‌ ప్రభుత్వానికి నిధులు అందకుండా చేయడం, ఐఆర్‌జీసీ సైనిక యంత్రాంగానికి డబ్బు చేరకుండా అడ్డుకోవడం, ఇరాన్‌ ఓడరేవులపై దిగ్బంధనాన్ని పొడిగించడం వంటి చర్యలు కూడా ట్రంప్‌ పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ ఈ చర్యలన్నీ తీసుకున్నా ఇరాన్‌ ఆలోచనా విధానంలో మార్పు రాకపోవచ్చు. పైగా అమెరికా తీసుకునే చర్యలకు ప్రతిగా హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉంది. అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రకంపనలు తీవ్రమవుతాయి. అమెరికాలో రాజకీయ ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక్కడ అమెరికాకు మరో మార్గం కూడా ఉంది. ఇప్పటికే అటకెక్కిన ఎంఓయూ బూజు దులిపి దాన్ని తిరిగి తెర పైకి తెచ్చేందుకు ప్రయత్నించవచ్చు. అయితే హార్ముజ్‌పై తనకు నియంత్రణ కల్పిస్తే తప్ప ఇరాన్‌ దానికి అంగీకరించదు. ముందుకు వెళ్లేందుకు ఏదైనా దారి ఉన్నదా అని రిపబ్లికన్‌ సెనెటర్‌ బిల్‌ కాసిడి అడిగిన ప్రశ్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఏదేమైనా ఐదు నెలలు దాటినా యుద్ధానికి ఎలా ముగింపు పలకాలన్న దానిపై ఆచరణయోగ్యమైన సూచనతో ఎవరూ ముందుకు రాకపోవడం ట్రంప్‌ ఎదుర్కొంటున్న గందరగోళానికి నిదర్శనం.

ఇంటా బయటా తప్పని ఎదురీత విజయం అసంభవం
అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఓ పోల్‌లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. హార్ముజ్‌ జలసంధిలో పరిస్థితిపై తమకు స్పష్టమైన అవగాహన ఉన్నదని కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే చెప్పారు. ఈ సంఘర్షణలో అమెరికాదే పైచేయి అని చెబుతున్న వారి సంఖ్య 40 శాతమే. ఇరాన్‌తో యుద్ధం ట్రంప్‌ ఊహించిన దానికంటే కష్టంగా ఉన్నదని ఏకంగా 76 శాతం మంది చెప్పారు. భూతల యుద్ధంలో అమెరికా చిక్కు కోకుండా చేయడానికి, లొంగిపోయేలా ఇరాన్‌ను బలవంతం చేయడానికి ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ తన చర్యలపై స్వయంగా విధించుకున్న పరిమితుల కారణంగా ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించడం అసంభవమని గత అనుభవాలు చెబుతున్నాయి. ఉద్రిక్తతను పెంచడం ట్రంప్‌ను ఇబ్బందికరమైన సంకటంలోకి నెట్టవచ్చు. అమెరికా లక్ష్యాలను నెరవేర్చే శాంతి ఒప్పందానికి స్పష్టమైన మార్గం ఏదీ కల్పిం చడం లేదు. ఎలా చూసినా విజయం సాధించలేని పరిస్థితే కనిపి స్తోంది.

రాజుకుంటున్న
 రాజకీయ వేడి
యుద్ధం కొన్ని వారాలలోనే ముగుస్తుందని చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఐదు నెలలు దాటినా దాని నుంచి బయటపడలేక పోతున్నారు. అటు దేశంలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. పెరుగుతున్న చమురు ధరలతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎర్ర సముద్రం ద్వారా చమురు సరఫరాలు జరుగుతాయని అనుకఁంటే హౌతీల హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు నిల్వలు అడుగంటుతున్నాయి. ఇంధన సంక్షోభం మరింత తీవ్రమవుతుందేమోనన్న ఆందోళన సర్వేసర్వత్రా కనిపి స్తోంది. మరోవైపు మధ్యంతర ఎన్ని కల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అత్తెసరు మెజారిటీతో నెట్టుకొస్తున్న అధికార రిపబ్లికన్లకు ఈ ఎన్ని కలు అగ్నిపరీక్ష కాబోతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -