Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసెప్టెంబర్ 1వ తేదీలోపు 
పీఆర్సీ ప్రకటించాలి

సెప్టెంబర్ 1వ తేదీలోపు 
పీఆర్సీ ప్రకటించాలి

- Advertisement -


ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

పీఆర్సీని సెప్టెంబర్ 1వ తేదీలోపు ప్రకటించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లోని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సంఘ కార్యాలయంలో టీటీజేఏసీ చైర్మెన్ పుల్లం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పీఆర్సీ ఇప్పటికే మూడేండ్లు ఆలస్యమైందనీ, ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఎస్ రద్దు చేయాలని, 2003 డీయస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, ఈహెచ్ఎస్ ను వెంటనే అమల్లోకి తెచ్చి ఆగస్టు 1 వరకు అన్ని ఆస్పత్రులలో నగదు రహిత చికిత్స అమలుచేయాలని తీర్మానించారు. సర్వీస్ రూల్స్ అమలుచేసి విద్యావ్యవస్థను పటిష్టపరచాలని, బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని, 342 ఉత్తర్వులు అమలులోకి తెచ్చి ఎస్సీ, ఎస్టీలకు పై చదువులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని తదితర తీర్మానాలను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, టీటీజేఏసీ భాగస్వామ్య సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -