ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృద్ధి ఎప్పుడు?

సమాజంలో మాట్లాడడానికి, వినడానికి అవినాభవ సంభంధం ఉంది. చెవులు వినిపిస్తేనే మాటలు వస్తాయి. మనకు వినిపించే శబ్దాలు మెదడుకు వెళ్లి నిక్షిప్తం అయినా మాటలను వినడం, వాటిని అనుకరించడం ద్వారానే మాటలు నేర్చుకుంటామనే విషయాన్నీ మర్చిపోతున్నాము. పిల్లలు పుట్టిన వెంటనే ఏడవడంతో పాటు చుట్టూ పక్కల శబ్దలను వింటుంటారు తల్లి మాట్లాడే మాటలకూ మనసు ఉప్పొంగిన, తండ్రి మాటలకూ ఒళ్లు పులకరించిన అంత వినికిడి ద్వారానే. మనిషికి మాటలు రావడానికి వినికిడి అత్యంత కీలకం. మనిషి మనుగడ సాగించాలంటే వినికిడే మూలమనే విషయాన్నీ గుర్తించకపోవడం వలన పుట్టిన శిశువుల్లో అనేక మంది మూగ, చెవిటి పిల్లలుగా మారుతున్నారు. అందుకే వినికిడిలోపాన్ని గుర్తించి ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007 మార్చి 3ను అంతర్జాతీయ వినికిడి దినోత్సవంగా ప్రకటించింది.వినికిడి లోపానికి గురైన వారికి మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల్లో అవగాహనా కల్పించడమే ప్రపంచ వినికిడి దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
ప్రపంచ జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మంది వినికిడి సమస్య కలిగి ఉన్నారు. వీరిలో 430 మిలియన్స్‌ మందికి వినికిడి లోపం ఉంది.2050 నాటికి 700 మిలియన్స్‌ మంది ప్రజలు వినికిడి లోపం కలిగి ఉంటారని అంచనా. వెయ్యి మందిలో 1-3 మంది పిల్లలు పుట్టుకతోనే వినికిడి లోపంతో పుడుతున్నారని, ప్రతి వెయ్యి మందిలో ఒక్కరిద్దరు బాల్యంలోనే శాశ్వత వినికిడి లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ప్రస్తుతం 110 కోట్ల మంది యువత వినికిడి లోపంతో బాధపడుతున్నారని అంచనా. 34 మిలియన్స్‌ మంది పిల్లలు వినికిడి లోపం కలిగి ఉన్నారు. వినికిడి లోపం కలిగిన వారిలో 60 శాతం మందికి వినికిడి లోపం నివారించడానికి అవకాశం ఉంది.ప్రజల ఆరోగ్యలను ప్రభావితం చేస్తున్న అనేక అంశాలలో వినికిడి సమస్య కూడా ఒక్కటి. పెద్ద శబ్దనికి గురికావడం, వఅధాప్యం, జ్వరాలు, చెవి ఇన్ఫెక్షన్స్‌ వంటి కారణాలతో వినికిడి సమస్య ఏర్పడుతుంది.వినికిడి లోపం వలన అనేక మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వినికిడి లోపం కలిగిన వారిలో 80 శాతం మందికి పైగా వినికిడి లోపం నివారణ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అందుబాటులో లేవు. అభివృద్ధి చెండుతున్న దేశాల్లో వినికిడి లోపం కలిగిన విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులో లేవు.పుట్టిన ప్రతి శిశువుకు వినికిడి పరీక్షలు చేపించాలి. ఆటోఎకోస్టిక్‌ ఏమిషన్‌ పరీక్ష చేసి వినికిడి సామర్థ్యన్ని గుర్తించాలి. వినికిడి సామర్థ్యం 30 డిసిబెల్స్‌ కంటే ఎక్కువ ఉంటే భవిష్యత్తులో వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్‌ స్టెమ్‌ ఎవకోడ్‌ రెస్పాన్స్‌ ఆడియోమెట్రి( బేరా) పరీక్ష ద్వారా వినికిడి లోపం ఎంత ఉందొ తెలుస్తుంది. వినికిడి లోపాన్ని ముందే గుర్తిస్తే వినికిడి పరికరాలు వాడడం, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చడం వలన వినికిడి లోపం కలిగిన పిల్లలు కూడా అందరి పిల్లలతో సమానంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.
ఇండియాలో వినికిడి లోపం సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే రిపోర్ట్‌ ప్రకారం ప్రతి లక్ష మందిలో 291మంది తీవ్రమైన వినికిడి లోపం కలిగి ఉన్నారని,14ఏండ్ల లోపు చిన్నారుల్లో వినికిడి లోపం తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా. దేశంలో ప్రతి ఏడాది సుమారుగా 30వేల మంది వినికిడి లోపంతో పుడుతున్నారని అంచనా.50ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న డయాబేటిక్‌ వ్యాధిస్త్రుల్లో 70శాతం మందికి వినికిడి లోపం ఉంది.పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలు పెరగడం వలన తీవ్రమైన శబ్దకాలుష్యం వలన వినికిడి లోపం ఏర్పడడానికి మరో కారణం.వినికిడి లోపాన్ని గుర్తిస్తే తగ్గించడానికి అవకాశం ఉంది. పిల్లలు తల్లి కడుపులో ఉండగానే 16 వారాల గర్భ సమయంలోనే శబ్దాలను వినడం, పుట్టిన వెంటనే తల్లి గొంతును గుర్తుపట్టడం జరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది.టీవీ సౌండ్‌ పెద్దగా పెట్టడం, దూరం నుండి పిలిస్తే పలకకపోవడం వంటి సమస్యలను
పిల్లల వయస్సుతో పాటు వచ్చే మార్పులలో తేడా కన్పిస్తే వినికిడి లోపం ఉందొ లేదో గమనించవచ్చు.వినికిడి లోపానికి మందు లేదు. వినికిడి పరికరాలు వాడడమే పరిష్కారం.హీయర్ఫోన్స్‌ వాడడం వలన వినికిడి శక్తి కోల్పోవడంతో పాటు మానసిక ఇబ్బందులు, అసహనం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్ర లేకపోవడం, తలనొప్పి వంటి సమస్యల బారిన పడుతున్నట్లు అనేక సర్వేల్లో వెళ్ళడైనది. భారత ప్రభుత్వం 2000 ఫిబ్రవరిలో సంవత్సరంలో తీసుకువచ్చిన శబ్ద కాలుష్య చట్టం ప్రకారం పారిశ్రమిక ప్రాంతాల్లో పగటి పూట 75 డెసిబుల్స్‌, రాత్రి పూట 70 డెసిబుల్స్‌, వాణిజ్య ప్రాంతాల్లో పగటి పూట 65 డెసిబుల్స్‌, రాత్రి పూట 55 డెసిబుల్స్‌, నివాస ప్రాంతాల్లో పగటి పూట 55 డెసిబుల్స్‌, రాత్రి పూట 45 డెసిబుల్స్‌, నిశ్శబ్ద ప్రాంతాల్లో పగటి పూట 50 డెసిబుల్స్‌, రాత్రి పూట 40 డెసిబుల్స్‌ పరిమితి మాత్రమే ఉండాలి కానీ విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, కోర్ట్‌ భావనలు వంటి ప్రాంతాల్లో 100 మీటర్స్‌ దూరం వరకు నిశ్శబ్ద జోన్స్‌గా ప్రభుత్వం తీర్మానం చేసింది. వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వలాది.2000 సంవత్సరంలో ప్రభుత్వం అమోదించిన చట్టం అమలు, పర్యవేక్షణ లేకపోవడంతోనే శబ్ద కాలుష్యం తీవ్రత పెరిగి వినికిడి లోపం ఏర్పడుతుంది.శబ్ద కాలుష్యన్ని నియంత్రిన పెంచాల్సిన అవసరం ఉంది.
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 40 శాతం వైకల్యం కలిగిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొందుటకు అర్హులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూగ,చెవిటి వికలాంగులకు 51శాతం వైకల్య ధ్రువీకరణ పత్రం ఉంటేనే ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అంటే 2016 =ూఔణ చట్టాన్ని తుంగలో తిక్కుతుంది.40శాతం వైఖల్యం కలిగిన మూగ చెవిటి వికలాంగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బధిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వా సమాచారం, జీవోలు సైన్‌ లాంగ్వేజ్‌లో తేవాలి. సామూహిక ప్రాంతాల్లో బధిరుల కోసం సైన్‌ లాంగ్వేజ్‌ సహాయకులను ఏర్పాటు చేయాలి. 77ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో నేటికీ అమెరికాన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ను వాడుతున్నాం. ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృధి పట్ల మన పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ అభివృద్ధి ఒక్కటే దేశంలో ఉన్న మూగ, చెవిటి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది
పెద్ద పెద్ద శబ్దాలు లేకుండా చూడడం, హియర్‌ ప్లాగ్‌ వంటి రక్షణ పరికరాలు వాడడం వంటి ప్రజరోగ్య చర్యలు చేపట్టడం వలన 50 శాతం వినికిడి లోపాన్ని నివారించవచ్చాని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గర్భిణుల్లో సైటో మేఘలో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ నీవరించడం, గర్బధారణకు ముందు రూబెల్లా వ్యాక్సిన్‌ వాడడం, బాలికలు, స్త్రీలలో రోగానిరోధక శక్తిని పెంచేందుకు మందులు వాడడం లాంటివి నీవరించడం ద్వారా పుట్టుకతో వచ్చే వినికిడి లోపాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం, దుమపానం, మధ్యపనాన్ని నీవరించడం వలన కూడా వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు. సమాజంలో వినికిడి లోపం కలిగిన వాళ్లు ఒంటరి వారు కాదు. స్పీచ్‌ థెరేపిస్ట్‌, వినికిడి సహాయ పరికరాలు అందుబాటులో ఉండడంతో పాటు సరైన చికిత్స తీసుకోవడం వలన వినికిడి లోపం కలిగిన వారు సాధారణ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
(మార్చి 3న అంతర్జాతీయ వినికిడి దినోత్సవం)
– యం అడివయ్య, 9490098713

Spread the love