నందికొండలో అక్రమ కట్టడాల పై కొరడా

– గుర్తించిన 20 ఇండ్ల కూల్చివేత
– ఇదే తరహాలో మరిన్ని అక్రమ కట్టడాలపై చర్యలు
– ప్రభుత్వ భూమిని అక్రమిస్తే చట్టపరమైన చర్యలు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖ, జిల్లా టాస్క్ ఫోర్స్, ఫైర్ స్టేషన్ అఫీసర్ ల ఆధ్వర్యంలో జె.సి.బి సాయంతో అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. సోమవారం తెల్లవారుజామున హిల్ కాలనీ విజయ విహార్ వెనుక భాగంలో ఉన్న సుమారు 20అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ కమిస్నర్ కె.వీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ మున్సిపల్ 2019 యాక్ట్ ప్రకారం నందికొండ పురపాలక సంఘం పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరిగిందని అన్నారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించి విక్రయించిన చట్టపరంగా తగు చర్యలు చేపడతామని తెలిపారు. మొదటి విడతగా సుమారు 20 అక్రమ కట్టడాలను గుర్తించామన్నారు. త్వరలోనే నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నఅక్రమ కట్టడాలపై చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.బిసన్న,విజయపురి టౌన్ ఎస్సై సంపత్ గౌడ్,తిరుమలగిరి సాగర్ ఎస్ఐ సురేష్, హాలియా ఎస్సై శోభన్ బాబు,రెవెన్యూ అధికారులు ఆర్ఐ. శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love