– కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం
– బీఆర్ఎస్ పరిగి ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్‌రెడ్డి సతీమణి ప్రతిమరెడ్డి
నవతెలంగాణ-దోమ
కొప్పుల కుటుంబం లక్ష్యం నిరుపేదలకు సేవ చేయడం ఆపదలో ఉన్న వారికి అండగా నేనున్నానంటూ.. మీ ముందుకు మీ ఇంటిలోనే ఒక సభ్యునిగా కలిసిమెలసి ఉండే మీతోటి తమ్ముడు, అన్న, నా భర్త పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మహేష్ రెడ్డి సతీమణి ప్రతిమ రెడ్డి కోరారు. గురువారం మండల పరిధిలోని దాదాపుర్ గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బందు, రైతుబీమా, దళితబంధు, బీసీబందు, మైనార్టీ బందు, కేసీఆర్ కిట్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం లాంటి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పరిగి నియోజకవర్గం అభివృద్ధి మహేశ్రెడ్డితోనే సాధ్యమన్నారు. పరిగిలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి నర్సింలు, గురుచరణ్, ప్రకాష్‌రెడ్డి, దస్తయ్య, బాలయ్య, నర్సింలు, గురు గౌడ్, చెన్నయ్య, ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.