Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంబాస్మతి బియ్యం ఎగుమతులకు పాక్ గండి?

బాస్మతి బియ్యం ఎగుమతులకు పాక్ గండి?

- Advertisement -

న్యూఢిల్లీ : హార్ముజ్ జలసంధిని తెరిస్తే పాకిస్తాన్‌కు చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారులు మధ్యప్రాచ్యంలో మన మార్కెట్ వాటాకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తానీ బాస్మతి ఎగుమతిదారులు ప్రస్తుతం సబ్సిడీతో కూడిన ధరల ప్రయోజనాన్ని పొందుతున్నారు. దీనివల్ల మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలంలో భారత బాస్మతి బియ్యం అమ్మకాలపై ప్రభావం పడవచ్చు. అనేక దశాబ్దాలుగా భారత్`పాక్ మధ్య శత్రుత్వానికి బాస్మతి బియ్యం కూడా ఓ కారణం అవుతోంది. బాస్మతి బియ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసేది, ఎగుమతి చేసేది మన దేశమే. అయినప్పటికీ సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, ఇరాక్, ఖతార్, ఒమన్, బ్రిటన్ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్ మార్కెట్ వాటాకు పాకిస్తాన్ గండి కొట్టే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌లో మన బాస్మతి బియ్యం ఎక్కువగా అమ్ముడవుతుండగా యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియాలలో పాక్ బాస్మతి బియ్యం అమ్మకాలు కూడా బాగానే జరుగుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే భారత్‘పాకిస్తాన్ బాస్మతి వాణిజ్యానికి మధ్యప్రాచ్యం (పశ్చిమాసియా ప్రాంతం) యుద్ధ క్షేత్రంగా మారింది. దేశంలో ఉత్పత్తి అయిన బాస్మతి బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం డ్యూటీ డ్రాబ్యాక్ పథకాన్ని అమలు చేస్తోంది. వాణిజ్యంలో నెలల తరబడి కొనసాగిన ఆటంకాల తర్వాత పాకిస్తాన్ తక్కువ ధరకే బాస్మతి బియ్యాన్ని అందిస్తుంటే మన అమ్మకందారులు అధిక ధరకు ఎలా అమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతోంది. బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే వారు చెల్లించిన పన్నును పాకిస్తాన్ ప్రభుత్వం పాక్షికంగా వాపసు చేస్తోంది. దీంతో వారు తక్కువ ధరకే బాస్మతిని అమ్ముకోగలుగుతున్నారు. అయినప్పటికీ పాక్ నుంచి బాస్మతి ఎగుమతులు అంత ఆశాజనకంగా లేవు. ఇరాన్ యుద్ధ సమయంలో అవి మరింతగా పడిపోయాయి. పైగా ప్రభుత్వ పథకంలో ఉన్న లోపాలు ఎగుమతిదారుల పాలిట శాపాలు అవుతున్నాయి. పైగా షిప్పింగ్, లాజిస్టిక్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -