కార్మిక వర్గ ఐక్యతతో మతోన్మాదాలను మట్టి కరిపిస్తాం

నవతెలంగాణ – హలియా 

కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని వివిధ జండాల కింద విభజిస్తూ కార్పొరేట్ల కుమ్ముకాస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని కార్మిక వర్గ జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని కార్మిక వర్గ ఐక్యతతో మతోన్మాదులను మట్టికరిపిస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి  నాగిరెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు హాలియాలో వివిధ సెంటర్లలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారమునకు రాకముందు అనేక వాగ్దానాలు చేసి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాన్ని నాలుగు కోడులుగా కుదించి కార్మిక వర్గాన్ని గొంతు నొక్కి కార్పొరేట్లకు కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ దేశ సార్వభౌమత్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. కార్మికులకు కనీస వేతనం 26000 ఇచ్చే విధంగా చట్టం చేయాలని ఉపాధి హామీని పరిరక్షించి దినసరి వేతనం ఎనిమిది వందల రూపాయలకు పెంచాలని రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి ఎమ్మెస్సీ రేటుని నిర్ణయించాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ సౌరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అనంతరం కార్మికులందరికీ దాతల సహకారంతో రాగిజావ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి సిఐటియు నాయకులు పొదిలి వెంకన్న ఎస్కే సయ్యద్ హుస్సేన్ యాదయ్య ఏసోబు వెంకన్న రేబిల్లి వెంకటేశ్వర్లు 5వ జిల్లా నాయకులు కారంపూడి ధనమ్మ, సైదమ్మ,అన్నపాక శ్రీను,ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు  నరేష్ రమేష్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love