కమ్యూనిస్టుల సపోర్టు లేకుంటే బీఆర్‌ఎస్‌కే నష్టం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-జనగామ
నేటి రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల సపోర్ట్‌ లేకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీకే తీవ్ర నష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్ర వారం జనగామలోని గబ్బెట గోపాల్‌రెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా సమితి సమావేశం జువా రి రమేష్‌ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో బిజెపి మత రాజకీయాలతో ప్రజలను చీల్చి రాజకీ య పబ్బం గడుపుకోవాలని చూస్తున్న తరుణంలో బిజెపి వ్యతిరేక లౌకికవాద శక్తులన్నీ ఏకమైతేనే సాధ్యమవుతుందని, అందులో కమ్యూనిస్టులు ముందుంటారని బిజెపిని భూ స్థాపితం చేయడానికి కమ్యూనిస్టులు ముందుంటారని శ్రీనివాసరావుఅన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసివ్యవహరించాలని సూచించారు. అందుకు ఉదాహర ణగా ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలాంటి తీర్పునిచ్చాయో, ఈ తీర్పునే 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో కొంత వ్యతిరేకత, సంక్షే మ పథకాలు అమలులో అసంతృప్తి వంటి అనేక సమస్యలు ప్రభుత్వానికి ఇబ్బందులు గా తయారైనవని, ఈ తరుణంలో వారు రాజకీయంగా లౌకికవాద శక్తులతో, ప్రధానంగా కమ్యూనిస్టులతో కలసి ఉంటేనే టిఆర్‌ఎస్‌ పార్టీకి లాభం జరుగుతుందని బిజెపిని ఓడిం చడం సాధ్యమవుతుందని శ్రీనివాసరావు అన్నారు. కమ్యూనిస్టులకు సీపీఐ ప్రజాపోరు యాత్రల ద్వారా, ఇంటింటికి సీపీఐ కార్యక్రమంతో లక్షలాది మందిని కలవడంతో పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం వచ్చిందని, ఇది ప్రజల్లో మంచి సంకేతాన్ని ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం లభించే విధంగా తయారైందని, ఈ ఉత్సాహంతోనే రాబోయే ఎన్నికల్లో సీపీిఐ సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఎన్నికల నాడు బిజెపిని ఓడించే లక్ష్యసాధనగా ఎత్తు లు పొత్తులు ఉంటాయని శ్రీనివాసరావు అన్నారు. దామాషా ఎన్నికల విధానం అంటే బూర్జువా పార్టీలకు ఎంతో భయమని, నోట్లు ఇచ్చి ఓట్లు కొని కోట్లు ఖర్చు ఖర్చు పెట్టే ఈ బూర్జువా పార్టీలకు, మైనార్టీ ఓట్లతో మెజార్టీ సీట్లతో రాజ్యమేలుతున్న వీరికి దోపిడి తప్ప, ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టదన్నారు. దామాషా ఎన్నికల పద్ధతి అమలు అయితే ఈ దేశంలో, రాష్ట్రంలో గానీ డబ్బు రాజకీయాల అంతమై, నీతి నిజాయితీ గల నిస్వార్ధపరులు, కమ్యూనిస్టులు చట్టసభల్లో కచ్చితంగా గెలిచి తీరుతారని చాలెంజ్‌ చేస్తు న్నాను అన్నారు. రాబోయే రోజుల్లో జరిగేది అదేనని, కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తున్నాయని, కార్యకర్తలు తెగించి ప్రజలకు వాస్తవాలు చెప్పి చైతన్యపరిచి ఉద్యమంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు. జూన్‌ 4వ తేదీన కొత్తగూడెంలో జరుగు భారీ బహి రంగ సభకు జనగామ జిల్లా నుండి వందలాది మంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపు నిచ్చారు. పోరాటాల గడ్డ జనగామలో తిరిగి మళ్లీ పాత రోజులు రాబ ట్టడానికి గ్రామ గ్రామాన తిరిగి ఎర్రజెండా ఎగరేసే విధంగా కార్యకర్తలు రాజకీయ చైత న్యవంతులై ఉద్యమ బాట పట్టాలని,జనగామ జిల్లాలో ఎన్నికల్లో సీపీఐ పార్టీ సత్తా చాటా లని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు పాతురు సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శిలు ఆకులశ్రీనివాస్‌ ఆది సాయన్నలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగళంపల్లి జనార్ధన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కావటి యాద గిరి, రావుల సదానందం, పైసా రాములు, చింత కింది అరుణ, కెమిడి మల్లయ్య, చామ కూర యాకూబ్‌, గుర్రం మధు, తోట రమేష్‌ బొమ్మినేని వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love