జోరుగా మట్టి దందా – పట్టించుకోని అధికారులు

నవతెలంగాణ-ఖానాపురం
ప్రభుత్వం మట్టి రవాణాపై కఠిన నిబంధనలు విధించినా మట్టి మాఫియా మాత్రం విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మండలంలో మట్టి దండ నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు కోకొల్లుగా వినిపిస్తున్నాయి. అక్రమార్కులు రెచ్చిపోతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో యథేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. మండల కేంద్రంలోని అశోక్‌ నగర్‌ లోని దుసముద్రం చెరువులో జెసిబి సహాయంతో మట్టిని ఇష్టానుసారంగా తోడేస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. మండలం దాటి నర్సంపేట పట్టణానికి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. మట్టి అక్రమ తరలింపుపై అధికారులకు ప్రజలు పలుమార్లు ఆరోపణలు చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సంబంధిత అధికారుల ముందే ఈతంగమంతా జరుగుతున్న కన్నెత్తి చూసిన నాథుడు లేడు అంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కొందరు అధికారుల అండదండలతోనే ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారని మండల ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత కొంత కాలంగా మట్టి దందా జోరుగా సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఇష్టారితగా తవ్వకాలు చేపడుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరించడం పై విమర్శలకు తావిస్తుంది. నిబంధనల ప్రకారం మట్టి అనుమతి పొందాలంటే మైనింగ్‌ శాఖ ద్వారా చాలాన్‌ చెల్లించి అనుమతి తీసుకోవాలి. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు నిబంధనలు అమలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అక్రమంగా మట్టి తరలిస్తే అధికారులకు కొంత ముట్ట జెప్పి ఇష్టారీతిగా తలరిస్తున్నారని మండలంలోని ప్రజల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువు నుండి మట్టి ని తొలగించడంతో గుంతలుగా ఏర్పడి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉండకపోలేదు.అధికారులు అందుబాటులో లేని సమయాన్ని అదనగా చూసుకొని రాత్రి వేళలో ఏదేచ్ఛగా మొరం దందా నడుపుతున్నారని సమాచారం. రాత్రి వేళలో ట్రాక్టర్ల సహాయంతో మోరాన్ని తరలించడంతో రహదారుల పక్కన ఉన్న నివాస ప్రజలకు ట్రాక్టర్ల శబ్దానికి నిద్రలేఖ ఇబ్బందులకు గురవుతున్నట్ల తెలుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మొరం దందా ని అరికట్టి ప్రకతిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం చెరువు కట్ట నుంచి 30 ఫీట్ల దూరం వరకు ఎలాంటి తవ్వకాలు చేయవద్దు. 30 ఫీట్ల తర్వాత చెరువులో ఉన్న పూడిక మట్టిని ఏటవాలుగా 3, 4 ఫీట్ల లోతుకు మించకుండా ఒకే స్థాయిలో తీసుకుంటూ పోవాలి. ఇష్టం వచ్చినట్లుగా ఒకే దగ్గర లోతు తవ్వకూడదు. చెరువుల్లో ఒండ్రు తప్ప మట్టి, మొరం అసలే తవ్వకూడదు. ఒకవేళ మట్టి, మొరం తవ్వితే చెరువు గతి మారుతుందని, చెరువుల్లోని నీరు భూమిలోకి ఇంకిపోయి ఎండిపోతాయని ఇరిగేషన్‌ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం : డిఈ రమేష్‌
ఇట్టి విషయమై నీటిపారుదల శాఖ డిఈ ని వివరణ కోరగా అధికారులు అందుబాటులో లేని సమయంలో రాత్రి వేళలో మొరం దందా నడుపుతున్నారు. పగలు మట్టిని రవాణా చేసేటప్పుడు ఫోటోలు తీశాము. మొరం దందా చేసే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.

Spread the love