నవతెలంగాణ-దర్పల్లి: మండల కేంద్రంలో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్మిక వర్గాలు ఘనంగా మేడే దినోత్సవం జరుపుకున్నాయి. ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య ముఖ్య అతిధిగా పాల్గొనడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులు బాలయ్య,భూమేష్ మమత రజిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాలన్నీ సంఘటితమై తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సంక్షేమ ఫలాలు అందరికి అందుతాయని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గానీ ఇతర మోటార్ ఫీల్డ్, అలాగే ఆయా రంగాల్లోని కార్మిక సోదరులు సంఘటితంగా ఉండి తమకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులు వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నుండి అభివృద్ధి ఫలాలను సాధించడానికి అభివృద్ధి పొలాలను సాధించడానికి ఎవరికివారు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. కార్మికుల హక్కులను వారి శ్రేయస్సు కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాలకు న్యాయం చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.
కార్మికులు తమ సమస్యల సాధనకు సంఘటితం కావాలి: చెలిమేల నర్సయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



