స్వాధార్ హోమ్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

నవతెలంగాణ – భగత్ నగర్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా   జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ,సీనియర్ సివిల్ జడ్జి కె వెంకటేష్  ఆధ్వర్యంలో పట్టణంలోని స్వాదార్ హోమ్ లో మొక్కలను నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డై యాక్సైడ్ ను గ్రహించి మన జీవితానికి కావలసిన ఆక్సిజన్ ని అందిస్తాయని ప్రతి మనిషి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని, వృక్షో రక్షిత రక్షితః వృక్షాలను మనం రక్షిస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయని  తెలిపారు.ఇప్పుడు వాతావరణం లో వస్తున్న మార్పులకి మనము వృక్షాలని నిర్లక్ష్యం చేయడమే కారణమని తెలిపారు. కార్యక్రమంలో  లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ మరియు  స్వాదార్ హోమ్  నిర్వాహకులు పాల్గొన్నారు.
Spread the love