నసురుల్లాబాద్ లో ధర్నా, రాస్తారోకో

– రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం 
నవతెలంగాణ -నసురుల్లాబాద్ 
తెలంగాణ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శలను ఖండిస్తూ నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కమిటీ, రైతుల ఆధ్వర్యంలో బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ వెళ్లే రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో రైతులు బాగుపడుతుంటే చూస్తూ ఓర్వలేకనే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని హెచ్చరించారు. దమ్ముంటే రానున్న ఎన్నికల్లో మీరు మాట్లాడిన విధంగా రైతులకు మూడు గంటల విద్యుత్ అందిస్తామని మేనిఫెస్టో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతును రాజుగా మారుస్తూ 24 గంటల ఉచిత విద్యుత్  రైతుబంధు, రైతు బీమా నిరంతర ఎరువుల సరఫరా వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల మేలు కొరకు కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాల్త్య విఠల్, సొసైటీ అధ్యక్షులు మారుతి పటేల్, దివిటీ శ్రీనివాస్, గంగారాం నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్, సాయిలు యాదవ్, డాక్టర్ నారాయణ, నాయిని హన్మండ్లు, కంది మల్లేష్, లక్ష్మీనారాయణ గౌడ్, తదితులున్నారు.
Spread the love