యువతా మీ శక్తిని గుర్తించండీ..

''లేండి.. మేల్కొనండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి..'' అన్న వివేకానంద మాటల స్ఫూర్తితో యువత తమ సామర్థ్యాన్ని గుర్తించాలి.”లేండి.. మేల్కొనండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి..” అన్న వివేకానంద మాటల స్ఫూర్తితో యువత తమ సామర్థ్యాన్ని గుర్తించాలి. ఈ వయసు జీవితానికి కీలకమై ఆర్థిక, వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తుంది. సంఘటితంగా కలిసి కట్టుగా పనిచేసే యువత అవసరం. అందరి శక్తులను ఒకే దిశగా ప్రోత్సహించి, వారి ఆలోచనలను సమన్వయం చేస్తే గొప్ప భారతదేశాన్ని నిర్మించవచ్చు.
ధనవంతులా, పేదవారా అనే తేడా లేకుండా, యువత ఒకతాటిపై నిలబడి తమ ఆలోచనలతో, చేతలతో ప్రపంచాన్ని మార్చగలరు. శ్రద్ధగా, క్రమశిక్షణగా పనిచేస్తే విజయం అందరికీ సులభంగా సాధ్యమవుతుంది. ఉత్సాహం, ధైర్యం, శక్తి, సామర్థ్యాల ద్వారా ఉన్నతమైన జీవితం సాధించవచ్చు.
యువత శక్తివంతమైన శ్రేణి
యువత అంటే ఉత్సాహం, పట్టుదల, ఓపిక, కషిల కలయిక. వారి ఆత్మవిశ్వాసం, నైపుణ్యం ద్వారా సమాజం కొత్త గమ్యాలను చేరుకుంటుంది. కాబట్టి, యువత తమ ప్రతిభను సమాజ హితం కోసం ఉపయోగించాలి.
సవాళ్లను స్వీకరించడం
జీవితంలో ప్రతి విజయానికి వెనుక కష్టాలు ఉంటాయి. సవాళ్లను ఎదుర్కొని, దానిపై సమర్థంగా పనిచేసినప్పుడు విజయం మన సొంతం అవుతుంది. ఒక నిర్దిష్ట లక్ష్యం ద్వారా మాత్రమే మన కషి ఫలిస్తుంది.
యువతకు సందేశం
యువతకు అండగా నిలబడి వారి వికాసానికి సహకరిస్తే, వారు కొత్త ఉద్యోగాలను సష్టించగలరు, నవకల్పనలకు దారి తీస్తారు, విజయాల్లో ఉదాహరణలుగా నిలుస్తారు. తమను తాము అభివద్ధి చేసుకునేలా ప్రేరణ పొందుతారు. ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి, సమాజానికి స్ఫూర్తి నింపగలరు. జీవితం పట్ల సరైన అవగాహన కలిగినప్పుడు మాత్రమే సమస్యలు అవకాశాలుగా మారతాయి
భయం వల్ల కలిగే నష్టాలు ఓటమి వల్ల కలిగే నష్టాల కంటే ఎక్కువ. కాబట్టి, ఆ భయాన్ని జయించడమే యువత ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం.ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని తాము కాపాడుకోవాలి. స్వేచ్ఛ అనేది ఎవరో ఇచ్చేది కాదు, అది మనం స్వయంగా సంపాదించుకునేదే.
మీ సమయం, శక్తిని సద్వినియోగం చేసుకొని, మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురండి. మీ కషి ద్వారా దేశానికి మేలు చేయండి. మీ ప్రతిభతో ప్రపంచానికి కొత్త మార్గాలను చూపించండి.
ఆత్మవిశ్వాసం విజయానికి పునాది
”నిన్ను నువ్వు నమ్ము, విజయం నీకు సాధ్యం.” ప్రతి వ్యక్తి తనకు ఉన్న ప్రత్యేకతను గుర్తించి ముందుకు సాగాలి. మన శక్తి, మన నైపుణ్యాలను గుర్తించడం ద్వారా విజయానికి దారులు వేయవచ్చు.
ప్రతిరోజూ శ్రమ
యువతకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయడం ఎంతో ముఖ్యమైంది. ప్రతిరోజూ స్థిరమైన కషి, ప్రత్యేకంగా ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల, యువత ఉన్నత శిఖరాలకు చేరగలుగుతుంది.
మానసిక, వ్యక్తిత్వ వికాసం
మనకు మనం ప్రతిరోజూ విశ్లేషించుకోవాలి. నిత్యం కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం వల్ల వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. స్థిరమైన దష్టి, క్రమశిక్షణ ద్వారా యువత తమ లక్ష్యాలను చేరుకోవచ్చు.
సామాజిక సేవ ద్వారా మార్గదర్శనం
డా. హిప్నో కమలాకర్స్‌ మైండ్‌ అండ్‌ పర్సనాలిటీ కేర్‌, నవభారత లయన్స్‌ క్లబ్‌ ద్వారా వ్యక్తిత్వ వికాసం, కెరీర్‌ గైడెన్స్‌, పోటీ పరీక్షలపై శిక్షణ, ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యువతకు అవసరమైన మార్గదర్శకంతో, వారి భవిష్యత్తును మెరుగుపరచడానికి కషి చేస్తున్నాం.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love