లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి..

నవతెలంగాణ – హైదరాబాద్: కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్‌ అనే యువకుడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో సమయానికి డబ్బులు కట్టలేక పోయాడు. కొంతమొత్తమే తిరిగి చెల్లించగలిగాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు.  ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. వెంటనే బాకీ చెల్లించాలని, లేదంటే తమ వద్దనున్న మార్ఫింగ్ ఫోటోలను నెట్‌లో పెడతామని, అలాగే కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా వాళ్లు వినిపించుకోలేదు. ఇంకా ఎక్కువగా వేధించడం స్టార్ట్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హేమంత్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Spread the love