చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి: సీఐ శ్రీనివాస్

నవతెలంగాణ – వేములవాడ రూరల్
యువత మత్తుకు, చెడు వ్యసనాలు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్  అన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల గ్రామంలో రూరల్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు ప్లే కార్డులతో భారీ ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ, ఎంఈఓ బన్నాజీ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క యువత మంచి మార్గంలో నడుస్తూ, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని బంగారు  భవిష్యత్తును ఎంచుకోవాలి, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని అన్నారు. అలాగే వేములవాడ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి, గుట్కా, తంబాకు, అమ్మిన, సరఫరా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  రూరల్ ఎస్సై మారుతి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వకులభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, గ్రామస్తులు, విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love