సులభతర దర్శనమే మొదటి ప్రాధాన్యత
తొలి పాలక మండలి మార్క్ పాలన చూపిస్తాం
వైటీడీ చైర్మెన్ సత్యనారాయణ రెడ్డి
బంగారు వాకిలిలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవ తెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల సులభతర దర్శనమే మొదటి ప్రాధాన్యత అని, తొలి పాలకమండలి మార్క్ పాలన చూపిస్తామని వైటీడీ చైర్మెన్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శనివారం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సందర్శకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
బంగారు వాకిలిలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
స్వామి వారి ప్రధానాలయ ముఖ మండ పంలోని బంగారు వాకిలి వద్ద నూతన ట్రస్టు బోర్డు (ధర్మకర్తల మండలి) పదవీ ప్రమాణ స్వీ కారం చేసింది. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య చైర్మెన్, సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. నూతన ట్రస్ట్ బోర్డు చైర్మెన్ గా ఎం.సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం.రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు.
ముగ్గురు గైర్హాజరు
పాలక మండలిలో సభ్యులుగా ఉన్న అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ధర్మకర్త తుళ్ల విజయందర్, ఎక్స్ అఫీషియో సభ్యులు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. అనువంశిక ధర్మకర్త కోర్ట్ లో కేసు ఉన్నందున ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని సమాచారం.
వైటీడీ నూతన పాలకమండలి ప్రమాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



