మండల స్థాయి వాలీబాల్ పోటీలు

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండల్ మంచిప్ప గ్రామంలో జై భారత్ యూత్ అద్యక్షులు నాయుడు సాయిరాం ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నటువంటి ఎక్సైజ్ ఎస్సై మల్లేష్ గారు మాట్లాడుతూ.. నేటి యువత మత్తు మాదకద్రవ్యాలకు బానిసలై, తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. స్వామి వివేకానంద సూచించిన బాటలో నడుస్తూ వారిచ్చిన ప్రసంగాలు, సూక్తులను మననం చేసుకుంటూ తమ భవిష్యత్తును సక్రమంగా మల్చుకోవాల్సిన బాధ్యత యువత పైన ఉంది అన్నారు. ఇలాంటి ఆటల పోటీలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు , మన గ్రామాలలో ఎవరైనా గంజాయి కానీ మాదకద్రవ్యాలు అమ్మే వారు ఉంటే మాకు తెలియజేయాల్సిందిగా కోరారు. గత 20 సంవత్సరాల నుండి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న జై భారత్ యువజన సంఘానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధార్థ, ఉప సర్పంచ్ జగదీష్ ,మాజీ ఎంపీటీసీ వెంకట్రం నాయక్, యూత్ అద్యక్షులు నాయుడు సాయిరాం వి డి సి అధ్యక్షులు గోవుర్ నరేష్ రెడ్డి,దేవేందర్, గంగప్రసాద్, మంచిప్ప, సేవలల్, తండా,బాడ్సి,ముదక్పల్లీ గ్రామాల యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Spread the love