జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి  పుట్టినరోజు వేడుకలు..

నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి జన్మదిన వేడుకలు సందీప్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎలిమినేటి సందీప్ రెడ్డి, యువసేన జిల్లా అధ్యక్షులు డొప్ప వెంకటేష్, నాయకులు యాట కుమార్, బచ్చు వెంకటేష్ పాల్గొన్నారు.
Spread the love