Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుటైటిల్‌ పోరుకు జ్వెరెవ్‌

టైటిల్‌ పోరుకు జ్వెరెవ్‌

- Advertisement -

సెమీస్‌‌లో అలవోక విజయం
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌

పారిస్‌ (‌ఫ్రాన్స్‌) : జర్మనీ స్టార్‌, రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ‌ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‌ఫైనల్లో కాలుమోపాడు. వరుస సంచలనాలతో మోత మోగిన పురుషుల సింగిల్స్‌ ‌టైటిల్‌ ‌రేసులో అగ్రశ్రేణి ఆటగాళ్లలో అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ ఒక్కడే ఆఖరు వరకు నిలిచాడు. జానిక్‌ ‌సినర్‌, నొవాక్‌ ‌జకోవిచ్‌, డానిల్‌ ‌మెద్వదేవ్‌ ‌వంటి మేటి ఆటగాళ్లు రేసు నుంచి నిష్క్రమించగా జ్వెరెవ్‌ ‌నిలకడగా రాణించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ‌సెమీఫైనల్లో చెక్‌ ‌రిపబ్లిక్‌ ఆటగాడు, 26వ సీడ్‌ ‌జాకుబ్‌ ‌మెన్సిక్‌‌పై జ్వెరెవ్‌ అలవోక విజయం సాధించాడు. నాలుగు సెట్ల పాటు సాగిన మ్యాచ్‌‌లో 7-5, 6-2తో తొలి రెండు సెట్లను సొంతం చేసుకున్న జ్వెరెవ్‌.. మూడో సెట్‌‌ను 3-6తో జాకుబ్‌‌కు కోల్పోయాడు. కానీ నాల్గో సెట్‌‌ను 6-3తో సొంతం చేసుకుని మ్యాచ్‌‌తో పాటు ఫైనల్లో బెర్త్‌‌ను కైవసం చేసుకున్నాడు. 8 ఏస్‌లు సంధించిన జ్వెరెవ్‌.. 4 బ్రేక్‌ ‌పాయింట్లతో మెరిశాడు. పాయింట్ల పరంగా 123-103తో జాకుబ్‌‌పై పైచేయి సాధించాడు.

మహిళల టైటిల్ ఎవరిదో?
మహిళల సింగిల్స్‌ కొత్త చాంపియన్‌‌ను చూడనుంది. అన్‌‌సీడెడ్‌ ‌పొలాండ్‌ అమ్మాయి మయా ఫాలిన్‌‌స్కా, రష్యా అమ్మాయి మిర్రా అండ్రీవా నేడు టైటిల్‌ ‌వేటలో తాడోపేడో తేల్చుకోనున్నారు. ఎనిమిదో సీడ్‌ అండ్రీవాకు ఇదే తొలి గ్రాండ్‌‌స్లామ్‌ ‌ఫైనల్‌ ‌కాగా.. మయా ఫాలిన్‌‌స్కాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ‌ఫైనల్‌. దీంతో నేడు ఎవరు నెగ్గినా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -