5-3తో సెమీస్‌లో పాకిస్తాన్‌పై గెలుపు
అండర్-18 హాకీ ఆసియా కప్
కకమిగహర (జపాన్) : భారత కుర్ర జట్టు ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. జపాన్ వేదికగా జరుగుతున్న అండర్-18 హాకీ ఆసియా కప్‌లో టీమ్ ఇండియా దుమ్మరేపింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పొరుగు దేశం పాకిస్తాన్‌పై 5-3తో ఉద్విగ్న విజయం సాధించింది. ఆఖరు 15 నిమిషాల ఆట ఆరంభం కావడానికి ముందు వరకు భారత్ 2-3తో వెనుకంజలో నిలిచింది. చివరి 15 నిమిషాల్లో హాట్రిక్ గోల్స్ కొట్టిన ఆశీష్ తాని పూర్తి అద్భుతం చేశాడు. 12వ నిమిషంలో తొలి గోల్ కొట్టిన ఆశీష్.. తర్వాత ఆఖరు 15 నిమిషాల ఆటలో 49వ నిమిషం, 53వ నిమిషం, 56వ నిమిషంలో గోల్స్ వర్షం కురిపించాడు. తొలి క్వార్టర్‌ను భారత్ 1-0తో ముగించగా.. రెండో క్వార్టర్‌లో పాకిస్తాన్ స్కోరు సమం చేసింది. మూడో క్వార్టర్‌లో షారుఖ్ అలీ (35వ నిమిషం) గోల్ కొట్టగా భారత్ 2-1తో ముందంజ వేసింది. కానీ పాకిస్తాన్ 37, 42వ నిమిషాల్లో గోల్స్‌తో 3-2తో ఆధిక్యం సాధించింది. ఆఖరు క్వార్టర్‌ను ఒత్తిడిలో మొదలెట్టిన భారత్ ఆశీష్ గోల్స్‌తో కేరింతలు కొట్టింది. 5-3తో మెరుపు విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో భారత్ తలపడనుంది.



