నేటినుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు


న్యూఢిల్లీ:
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా 16 కొత్త బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వాటిలో బయోలాజికల్‌ డైవర్సిటీ, మల్టీ-స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీలు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు, నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లు, అటవీ సంరక్షణ చట్ట సవరణ వంటి బిల్లులు ఉన్నాయి. కాగా, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈడబ్ల్యూఎస్‌ కోటా, రూపాయి మారకపు విలువ పతనం, ఇండో-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్టీ పన్నుల వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాల్సిందేనని అఖిలపక్షాలు పట్టుబడుతున్నాయి.

 

Spread the love