ఆసరా పెన్షన్లు పెంచుతామన్న హామీ నెరవేర్చాలి: వనం ఉపేందర్..

– వికలాంగుల పెన్షన్ రూ.6000 లకు, వృద్దులు, వితంతువుల పెన్షన్ రూ.4000 లకు వెంటనే పెంచి అమలు చేయాలి..
– పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.300 నుండి రూ.3000లకు పెంచాలి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పెన్షన్స్ పెంచుతామని ఇచ్చిన హామిని వెంటనే అమలు చేయాలని, పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.300 రూపాయలను రూ.3000లకు పెంచాలని డిమాండ్ చేస్తూ జులై 3న రాష్ట్ర వ్యాపితంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక  జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వికలాంగుల కనిపిస్తున్న పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం వాటా 2011 నుండి కేవలం రూ.300 రూపాయలే ఇస్తుంది. రూ.300 రూపాయలతో బ్రతికేది ఎట్లా? నిత్యావసర సరకుల ధరలు గడిచిన 13ఏండ్ల కాలంలో రూ.300 రేట్లు పెరిగినవి. ధరల పెరుగుదల సూచికి అనుగుణంగా పెన్షన్స్ ఎందుకు పెంచడం లేదనీ, సాబ్ కా సాత్ సాబ్ కా వికాస్ అంటున్న కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ ఎందుకు పెంచడం లేదని, పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా పెంచకుండా వికలాంగుల గురించి మాట్లాడే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని సందర్భంగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వికలాంగుల పెన్షన్ రూ.6000,వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్స్ రూ.4000లకు పెంచుతామని హామీ ఇచ్చారనీ, ప్రభుత్వం ఏర్పడి 7నెలలు గడుస్తుందనీ,  ప్రభుత్వం నిర్ణయం కోసం 44,49,767 మంది ఆసరా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. 2024 జనవరి నుండే పెంచిన పెన్షన్స్ అమలు చేస్తామని అధికారంలోకి రాక ముందు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టం అమలు వంటి వాటిని వెంటనే అమలు చేసే విదంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 7నెలల కాలంలో సకలాంగుల సంక్షేమo కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. కానీ వికలాంగుల కోసం మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజాపాలనలో దరఖాస్తూ చేసిన 24.84 లక్షల మందికి వెంటనే పెన్షన్స్ మంజూరు చేయాలనీ కోరారు. ప్రస్తుతం క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్స్  సంతకాలు పెట్టె విదంగా ఉత్తర్వులు ఇవ్వాలనీ, 2016 ఆర్పిడబ్ల్యుడి  చట్టం కొత్తగా గుర్తించిన 14రకాల వైకాల్యలకు సదరం సర్టిఫికెట్స్ ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలనారు.  తలసేమియా, సికిల్ సెల్, హేమోఫీలియా, అంటీజం, కండరాల క్షినత, న్యూరోలాజికల్ డిజర్దర్స్ వంటి వైఖల్యాలు కలిగిన వారికి నేటికీ కూడా ప్రత్యేకంగా సదరం సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.ఆసరా పెన్షన్ లలో కేంద్ర ప్రభుత్వం వాటా పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని జులై 3న  జరిగే ధర్నాలలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి, జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత లు పాల్గొన్నారు.
Spread the love