ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను చెల్లించండి

–  మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. బడ్జెట్‌ సమా వేశాల్లోనూ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చానని తెలిపారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు అధ్యాపకులతోపాటు డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లు జీతాలు, గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు, ఉద్యోగులు, ఉపాధ్యా యుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లింపులు, జీవిత బీమా చెల్లింపులు, సరెండర్‌ లీవు వేతన చెల్లింపులు, మెడికల్‌ రీయిం బర్స్‌మెంట్‌ చెల్లింపులు ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నాయం టూ సంబం ధిత వ్యక్తులు, సంఘాల నాయకులు తన దృష్టికి తెచ్చారని వివరించారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను పూర్తి చేసి వారి ఖాతాల్లో జమ చేయించాలని కోరారు.

Spread the love