నేటినుంచి పీజీఈసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2023 -24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ దర ఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమవు తుంది. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు ఏప్రిల్‌ 30 వరకు గడు వున్నది. మే రెండు నుంచి నాలుగో తేదీ వరకు సమర్పించిన దరఖాస్తుల ను సవరించేందుకు అవకాశమున్నది. ఆలస్య రుసుం రూ.250తో మే ఐదు వరకు, రూ.వెయ్యితో పదో తేదీ వరకు, రూ.2,500తో 15 వరకు, రూ.ఐదు వేలతో అదేనెల 24వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు. హైదరాబాద్‌, వరంగల్‌లో మే 29 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహిస్తారు. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.600, ఇతరులు రూ.1,100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇతర వివరాలకు https:pgecet.tsche.ac.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Spread the love