భూ సమస్య పరిష్కరించకపోవడంతో..

–  కలెక్టరేట్‌ పైకి ఎక్కి రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‌
దశాబ్ద కాలానికి పైగా అపరి ష్కృతంగా ఉన్న తమ భూ సమ స్యను పరిష్కరించడంలో అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ సోమ వారం రైతు దంపతులు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసు కున్నారు. ఇదే రైతు గతంలో కూడా కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలు స్తోంది. జనగామ జిల్లా మండలం పసరమట్ల గ్రామానికి చెందిన రైతు దంపతులు నిమ్మల నర్సింగరావు, రేవతి సోమవారం ప్రజావాణి కార్య క్రమం సందర్భంగా తమ సమస్యను వివరించుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. కాగా, ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని తన భూసమస్యను అధికారులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో కలెక్టరేట్‌ పైకి ఎక్కి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ప్రజలు ఆందోళనతో అటువైపు పరిగెత్తారు. తమ భూమిని స్థానిక తహసీిల్దార్‌ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని బాధిత రైతు ఆరోపించారు. పోలీసులు, అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

Spread the love