మాక్స్‌లైఫ్‌తో ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ జట్టు

హైదరాబాద్‌: జీవిత బీమా సంస్థ మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదు ర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఆ బ్యాంక్‌ 73 లక్షల మంది ఖాతాదారులకు మాక్స్‌ లైఫ్‌ రిటైల్‌, సమూహ బీమా ఉత్పత్తులు లభించనున్నాయి. ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బి దేశంలో 606 శాఖలతో విస్తరించి ఉంది. జీవిత బీమా ద్వారా భద్రత, ఆర్థిక కలయికతో మరింత మంది వినియోగదారులకి స్వాలంభన ఇచ్చే మా ప్రయాణంలోకి ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ని స్వాగతిస్తున్నామని మాక్స్‌ లైఫ్‌ ఎండీ ప్రశాంత్‌ త్రిపాఠి పేర్కొన్నారు.

Spread the love