నవతెలంగాణ – హైదరాబాద్
దివంగత నటి శ్రీదేవి 1969లో తన నాలుగేళ్ల వయసులోనే తునైవన్ అనే తమిళ చిత్రంతో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. హిమ్మత్ వాలా, మూండ్రం పిరై, మిస్టర్ ఇండియా, చాందినీ, ఇంగ్లిష్ వింగ్లిష్ వంటి తదితర చిత్రాల్లో నటించారు. 2013లో శ్రీదేవి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌరపురస్కారమయిన పద్మశ్రీ లభించింది.
ఐఎండిబిలో శ్రీదేవి టాప్ 9 అత్యధిక రేటింగ్ పొందిన టైటిల్స్ ఇవే:
1) మూండ్రం పిరై -8.6
2) ఒలవు గెలువు – 8.4
3) సద్మా -8.3
4) వరుమైన్ నిరం సిగప్పు -8.3
5) జగదేక వీరుడు అతిలోక సుందరి -8.1
6) క్షణక్షణం-8.1
7) పదహరెళ్ళ వయసు -8.1
8) పతినారు వయథినిలే -8.0
9) ఇంగ్లిష్ వింగ్లిష్ -7.8