ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు సునీత్ దయానంద్ అర్హత సాధించాడు.మంగళవారం జరిగిన అర్హత మ్యాచ్ లో దయానంద్ వరుససెట్లలో స్థానిక ఆటగాడు హోప్ కరోనోను చిత్తుచేశాడు.హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో దయానంద్21-17, 21-15తో ముగించాడు.అంతకుముందు మ్యాచ్ లో మలేషియాకు చెందిన మింగ్ హాంగ్ లిమ్పై 21-9, 21-16తో గెలిచి ఆసీస్ ఆటగానితో పోటీకి సిద్ధమయ్యాడు.బుధవారం జరిగే తొలిరౌండ్ లో దయానంద్ చైనాకు చెందిన హు షీ అన్ తో తలపడనున్నాడు.మరో పోటీలో మన్రాజ్ 11-21, 18-21తో మలేషియాకు చెందిన ఇగోనే ఈవ్ చేతిలో ఓడాడు.ఇక పురుషుల డబుల్స్ లో అచ్యుతాధిత్యరావ్-అర్జున్ జంట 15-21, 15-21తో ఆస్ట్రెలియన్ ద్వయం చేతిలో పరాజయాన్ని చవిచూశారు.బుధవారం నుంచి మెయిన్ డ్రా తొలిరౌండ్ పోటీలు జరగనున్నాయి.
మెయిన్ డ్రాకు దయానంద్
- Advertisement -
- Advertisement -


