Wednesday, June 10, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాదేశ్‌ సంచలనం

బంగ్లాదేశ్‌ సంచలనం

- Advertisement -

ఆస్ట్రేలియాపై 86పరుగుల తేడాతో గెలుపు
ఢాకా: ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్‌ ఊహించని షాక్ ఇచ్చింది.బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 86పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.దీంతో36ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్‌కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ను మొసద్దెక్‌ హొస్సేన్‌ (86నాటౌట్‌)కి తోడు తంజిద్‌ హసన్‌ తమీమ్‌(54),నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (67)కూడా అర్ద సెంచరీలతో ఆదుకున్నారు.దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50ఓవర్లలో8వికెట్ల నష్టానికి 284పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌కు మూడు,లియామ్‌ స్కాట్‌,మ్యాట్‌ రెన్షా తలో 2వికెట్లతో రాణించారు.ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.కామెరూన్ గ్రీన్ (52)ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా..మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా నాలుగు వికెట్లతో కంగారూలను కంగారు పెట్టించాడు.ఆస్ట్రేలియా42.2ఓవర్లలో9వికెట్ల నష్టానికి 191పరుగులు చేసింది.ఈ దశలో వర్షం​ అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -