వంశీరామ్ బిల్డర్సపై రెండోరోజు ఐటీ సోదాలు


హైదరాబాద్:
వంశీరామ్ బిల్డర్స్‌పై ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు విలువైన భూముల పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సూట్ కేసుల్లో విలువైన పత్రాలను ఐటీ కార్యాలయానికి తరలించారు. వంశీ రామ్ బిల్డర్స్ ఉద్యోగుల ఖాతాల్లో భారీ లావాదేవీలను గుర్తించారు. ఉద్యోగుల ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 15 బృందాలతో 19 ప్రాంతాల్లో ఐటీ ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది. వంశీ రామ్ బిల్డర్స్ ఛైర్మెన్ సుబ్బారెడ్డి నివాసంతో పాటు, కంపెనీ కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డితో పాటు బావమరిది జనార్ధన్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ సీఈవో, డైరెక్టర్లు, సిబ్బంది ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లిటిగేషన్ స్థలాలు కొనుగోలు చేసి అక్రమ ప్రాజెక్టులు నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ ఆరా తీస్తోంది.

Spread the love