విద్యార్థుల భాగస్వామ్యం కీలకం

– భారత నేవీ అధికారి బి. శివకుమార్
– ఇండియన్‌ నేవీ, ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ మధ్య ఎంఓయూ
కట్టంకులతూర్‌ : రక్షణ రంగంలోని మేకిన్‌ ఇండియాలో విద్యార్థుల భాగస్వామ్యం ముఖ్యమైన దని భారత నావికాదళాధికారి, అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ మార్షల్‌ (సమాచార సాంకేతిక సేవలు) బి. శివకుమార్‌ అన్నారు. భారత నేవీ, ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ ల మధ్య ఎంఓయూ సంతకం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్న తరుణంలో దేశీయ పరికరాల విషయంలో విద్యార్థులు అపారమైన సహకారాన్ని అందించగలిగారని చెప్పారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. పొన్నుస్వామి, సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఆర్‌డీఐఎస్‌) సలహాదారు వి.పి. నెడుంచెజియన్‌ ల సమక్షంలో ఎంఓయూపై భారత నౌకా దళ అధికారులు కలా హరికుమార్‌, బి. శివకుమార్‌, ప్రొఫెసర్‌ ముథమిజ్‌ చెల్వన్‌ లు సంతకాలు చేశారు.

Spread the love