స్టార్టప్‌లకు 33% తగ్గిన నిధులు

న్యూఢిల్లీ: భారత స్టార్టప్‌ సంస్థలకు నిధులు తగ్గాయి. గడిచిన ఏడాది 2022లో స్టార్టప్‌లకు ఫండ్స్‌ 33 శాతం తగ్గి 24 బిలియన్‌ డాలర్ల (రూ.1.95 లక్షల కోట్లు)కు పరిమితమయ్యాయయని పిడబ్ల్యుసి ఇండియా ఓ రిపోర్టులో తెలిపింది. 2021లో ఈ సంస్థలు 35.2 బిలియన్‌ డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు)ను సమీకరించగలిగాయి. అయితే ఇంతక్రితం రెండేళ్లతో పోల్చితే గడిచిన ఏడాదిలో రెట్టింపు నిధులు అందాయి. ”ప్రస్తుత కఠిన పరిస్థితుల నేపథ్యంలో అనేక స్టార్టప్‌లు కూడా కొత్త పెట్టుబడులు, నిధుల సమీకరణపై వేచి చూసే దోరణీని అవలంభిస్తున్నాయి. భారత స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నారు.” అని ఈ రిపోర్ట్‌ పేర్కొంది. మరో రెండు, మూడు త్రైమాసికాల్లో ఫండింగ్‌ పరిస్థితులు సాధారణ స్థితికి రావొచ్చని పిడబ్ల్యుసి ఇండియా ఇండియా స్టార్టప్‌ లీడర్‌ అమిత్‌ నౌవ్కా పేర్కొన్నారు. గతేడాది బెంగళూరు, ఎన్‌సిఆర్‌, ముంబయి నగరాల్లోని స్టార్టప్‌లు అధికంగా నిధులను ఆకర్షించాయని ఈ రిపోర్ట్‌ తెలిపింది.

Spread the love