– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్
నవతెలంగాణ-చేర్యాల
విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ముందుండి పోరాడాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ యువతకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్ లో ఆదివారం దాసరి ప్రశాంత్,ఆముదాల రంజిత్ రెడ్డి , బత్తుల అభిషేక్ భాను అధ్యక్షతన జిల్లా యువ కమ్యూనిస్టులకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ..విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలని, దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, పేదల పైన భారాలు వేసి కార్పొరేట్లకు రుణాలు ఇచ్చి మాఫీ లు చేస్తున్నారని విమర్శించారు. అడవులను కొళ్లగొట్టి ఆదివాసులపై దాడి చేసి వారి హక్కులను, ఖనిజ సంపదను రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ లకు ఊడిగం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు బనాయించి అర్బన్ నక్సల్స్,దిమంగి నక్సల్స్ అని స్వయాన దేశ ప్రధాని అనడం సిగ్గుమాలిన మాటలు అని, హక్కుల కోసం పోరాడే వారు ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న బీజేపీ పై వ్యతిరేకత పెరుగుతానందని, బీజేపీ కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేంద్రం దాటి వేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తి రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో,ఆలేటి యాదగిరి,సింగిరెడ్డి నవీన, జలిగాపు శిరీష, బండకింది అరుణ్ కుమార్,తాడూరి రవీందర్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



