42 పాఠశలలకు గాను ఏడు చోట్ల 100% పూర్తయిన పనులు..

– త్వరలోనే పనులు పూర్తి: ఎంపీడీఓ రవీందర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని 42 పాఠశాలలకు గాను ఏడు చోట్ల 100% శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మిగిలిన చోట్ల పనులను పూర్తి చేయాలని ఇప్పటికే అదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీఓ రవీందర్ అన్నారు. మంగళవారం అయన విలేకరులకు వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం లో బాగంగా  డిచ్ పల్లి మండలంలో 44 పాఠశాలలు ఉన్నాయని, అందులో నాలుగు రకాల కాంపౌండ్ల కింద మైనర్ రిపేర్, టాయిలెట్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ విభాగాల కింద 161 పనులు ఉన్నాయని తెలిపారు. అందులో మైనర్ రిపైర్స్ 36 స్కూళ్లకు గాను 8 స్కూల్ 100% కంప్లీట్ అయినయని, మిగితా పనులు  దాదాపు 65% శాతం పూర్తయిందని, టాయిలెట్ వర్క్స్ లో 42 స్కూల్ లగాను ఏడు స్కూల్లు 100% పూర్తయిన మిగిలిన పనులు దాదాపుగా 50% నుంచి 60% శాతం వరకు పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిషన్ వర్క్స్ లో 41 స్కూల్ లగాను 29 స్కూలు 100% పూర్తయినవి మిగతా వర్క్స్ కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతాయని వివరించారు. డ్రింకింగ్ వాటర్ 42 స్కూల్లో గాను 14 స్కూల్లో 100% పూర్తి కాగా మిగతావి  రెండు మూడు రోజుల్లో పూర్తయి మొత్తం మీద 44 స్కూల్ లలో 161 గాను  58 వర్క్స్ 100% పూర్తయిని మిగతావి ఈ రెండు మూడు రోజుల్లో పూర్తయి హెచ్ఎం  లకు అప్పచేప్పడం జరుగుతుందని తెలిపారు.మండలంలోని అన్ని పాఠశాలలకు గాను అడ్వాన్స్ కింద 10% డబ్బులు, కలెక్టర్  25 లక్షలు అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని స్కూళ్లకు వారి వారి రేషియో ప్రకారము వారి అకౌంట్లోకి  అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ పై కలెక్టర్ కి లేఖా రాయడం జరిగిందని వివరించారు. సిమెంటు పనులు గత వారం రోజుల నుంచి ప్రారంభమైనయని, క్యూరింగ్ అవసరం కోన్ని రోజుల పాటు పనులు 100%పూర్తవుతాయని ఎంపిడిఓ రవీందర్ అశాభావం వ్యక్తం చేశారు.ననులు పూర్తిచేసిన, చేయని వాటినీ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తామని అనుకుంటున్నా బుధవారం నుండి  పాఠశలలు మొదలు కానున్న దృశ్య విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్  అందజేయడం జరుగుతుందని తెలిపారు.
Spread the love