హైదరాబాద్ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్ గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో 9.35 శాతం వృద్ధితో రూ.1,000.56 కోట్ల రెవెన్యూను సాధించి నట్టు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది రూ.915 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.208 కోట్లుగా ఉన్న లాభాలు.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 27.83 శాతం వృద్ధితో రూ.267.94 కోట్లుగా ప్రకటించింది. పత్తి రెవెన్యూలో 2.87 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు తెలిపింది. మంగళవారం బీఎస్‌ఈలో కావేరి సీడ్ షేర్ 2.14 శాతం పెరిగి రూ.524.55 వద్ద ముగిసింది.