నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో నివసిస్తున్న నిండు గర్భిణి ప్రసవం కోసం బోనగిరి జిల్లా ఆసుపత్రికి ఉదయం 5:30 సమయంలో రావడం జరిగింది. మూడో కాన్పు కోసం శాంతి అనే నిండు గర్భిణీ ఆసుపత్రికి రాగానే పరీక్షించిన వైద్యులు రక్తహీనత తక్కువగా ఉన్నదని చెప్పి గాంధీ హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు. పేషంట్ యొక్క బంధువులకు భువనగిరి 108 అంబులెన్స్ కు సమాచారం అందించి వెంటనే వెళ్లాలని సూచించడం జరిగింది. తక్షణమే అక్కడ చేరుకున్న 108 సిబ్బంది ని అంబులెన్స్ లోకి తీసుకొని గాంధీ హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించగానే పగిడిపల్లి దగ్గరికి రాగానే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని అక్కడే ఆపి 108 అంబులెన్స్ లోనే మహిళకు సుఖ ప్రసవం చేశారు. మూడవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మెరుగైన చికిత్స కోసం మళ్లీ జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. సమయస్ఫూర్తితో అంబులెన్స్లో కాన్పు నిర్వహించిన 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు అభినందించారు. కాగా అంతకుముందు వైద్యులు హాస్పిటల్లో కాన్పు నిర్వహించినందుకు ఆవేదన వ్యక్తం చేశారు.