జిల్లాలో సి విజిల్ యాప్ లో 133 ఫిర్యాదులు

 – ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కువ ఫిర్యాదులు.

నవతెలంగాణ- అచ్చంపేట : అసెంబ్లీ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలు నాపై ఫిర్యా చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సి విజిల్ యాప్ తీసుకొచ్చింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ పట్టిష్ట చర్యలు తీసుకుంటుంది. ప్రతి పౌరుడు సామాన్య ప్రజల సైతం సి విజిల్ యాప్ లో ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయవచ్చు అని సూచించారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లాలో సి విజిల్ యాప్ పై అధికారుల అవగాహన కల్పించారు ప్రజలు పౌరుల నుంచి మంచి స్పందన వచ్చింది జిల్లాలో నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కల్వకుర్తి అచ్చంపేట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలు పై 133 ఫిర్యాదులు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో 48 ఫిర్యాదులు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపి రామ్ నవ తెలంగాణతో తెలిపారు. పోస్టర్ల తొలగింపు, బ్యానర్ల తొలగింపు, సమయం గడిచిన తర్వాత ప్రచారం చేస్తున్న సందర్భంగా, రేషన్ డీలర్లు ప్రచారం చేస్తుండగా ఇలా అనేక రకాలుగా ఫోటోలు వీడియోలు తీసి సివిజన్ యాప్ లో ఫిర్యాదు చేశారు. ఉప్పునుంతల మండలంలో ఇద్దరు డీలర్లు అధికార పార్టీకి ప్రచారం చేస్తుండగా పౌరులు ఫోటోలు వీడియోలు తీసి సి విజిల్ యాప్ లో అప్లోడ్ చేశారు. స్పందించిన అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను గుర్తించి కలెక్టర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్లు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూలు జల్లాలో అత్యధికంగా సివిజన్ యాప్ లో ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Spread the love