19 లక్షల నగదు పట్టివేత 

– పూలంగ్ చౌరస్తాలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు
– 19 లక్షలకు ఆధారాలు లేవు
– ధ్రువపత్రాలు లేని నగదును సీజ్ చేసిన పోలీసులు
– నిజామాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న నగదు పట్టివేత
– అసలు డబ్బులు ఎవరివి
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో 19 టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.పూలంగ్ చౌరస్తాలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిపై అనుమానంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 19 లక్షలు లభ్యమయ్యాయి. లభ్యమైన
19 లక్షలకు ఆధారాలు లేవు.టేధ్రువపత్రాలు లేని కారణంగా నిజామాబాద్ పోలీసులునగదును సీజ్ చేశారు. నిజామాబాద్ నగరంలో రోజురోజుకు  నగదు పట్టివేత పెరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు ఆ డబ్బులు ఎవరివి అనేవి ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి తప్ప పోలీసులు సైతం వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించడం లేదు. కేవలం నగదును తీసుకువచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి అలాగే డబ్బులు తీసుకువస్తున్న వ్యక్తిని పట్టుకొని డబ్బులను సీజ్ చేస్తున్నారే తప్ప అసలు డబ్బులు ఎవరివి అనేది తెలపడం లేదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ , అడిషనల్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్ జయరాం ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీ కిరణ్ కుమార్ ఏసిపి టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పట్టణ సిఐ నరహరి నాల్గవ పట్టణ ఎస్సై సంజీవ్  టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిజామాబాద్ కు చెందిన గోగు మణికంఠ అనే వ్యక్తి 19 లక్షల రూపాయలు ఎటువంటి ఆధారములు లేకుండా తీసుకు వెళుతున్నందున పట్టుకొని, పత్రాలు చూపించమని అడగగా ఎటువంటి పత్రములు లేనందున వాటిని సీజ్ చేసి ఐటీ శాఖ వారికి సమాచారం అందించనైనది. ఇట్టి 19 లక్షల రూపాయలను స్వాధీన పరచుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనావర్ అభినందించడం జరిగినది.
Spread the love