నిర్మల్‌లో బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : నిర్మల్‌ జిల్లాలో ముస్కాన్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. సారంగాపూర్‌ మండలంలోని రాణాపూర్‌ గ్రామం దగ్గర గత అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడిన అనంతరం డ్రైవర్‌ ఘటనా ప్రాంతం నుంచి పరారయ్యాడు. బస్సు ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Spread the love