ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందువెళ్తున్న లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రాయన గుట్ట ఓల్డ్ సిటీకి చెందిన కుటుంబ సభ్యులు గుల్బర్గా నుంచి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వ్యక్తులు మహమ్మద్ మున్నావర్ (35), ఫాతిమా బేగంగా గుర్తించారు. గాయాలైన నలుగురు జాఫర్, సర్వార్, షఫీ, గున్ బాషలను ఆసుపత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love